Crime News: కువైట్లో అగ్నిప్రమాదం.. భారతీయ కుటుంబం సజీవదహనం
కువైట్లోని ఓ భారతీయ కుటుంబం ఉంటున్న ఫ్లాట్లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లో ఉన్న భార్యభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు. ఇంట్లో ఏసీ పవర్ ఫెయిల్యూర్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.