దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచార ఘటనలో రోజురోజుకు విస్తుపోయే విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌కు కూడా శుక్రవారం కోల్‌కతా ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఆర్జీకార్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, మరో నలుగురు డాక్టర్లు, అలాగే సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్టు చేసేందుకు కూడా కోర్టు అనుమతిచ్చింది. అయితే ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు తమ హత్యాచార ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు తాజాగా ఓ జాతీయా మీడియాతో మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Kolkata Doctor Case: ఒక్కరు కాదు చాలామంది ఉన్నారు.. అభయ తల్లిదండ్రుల సంచలన ఇంటర్వ్యూ
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అభయ తల్లిదండ్రులు తమ కూతురుకి జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో చాలామందికి సంబంధం ఉందని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Translate this News: