BRS MLC Kavitha : మళ్ళీ వాయిదా..
సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ తీర్పును మళ్ళీ వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మే 6 కు వాయిదా వేసినట్టు స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా చెప్పారు.
సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ తీర్పును మళ్ళీ వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మే 6 కు వాయిదా వేసినట్టు స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా చెప్పారు.
సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మీద ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని..మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు కవిత. ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరారు.
తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పది రోజుల కస్టడీ ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో మరో నిందితురాలిగా భావిస్తున్న ఎమ్మెల్సీ కవితను, కేజ్రీవాల్ ను ఇద్దరినీ ఒకేసారి విచారించవచ్చు అనే విషయం వినబడుతుంది.
కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని , దీనిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు,మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఈడీ, సీబీఐలను ప్రధాన ఆయుధాలుగా వాడుకుంటుందని ఆయన ఆరోపించారు. అవి రెండు కూడా బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయని అన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కు తీసుకున్నారు. ఆల్రెడీ ఈడీ అరెస్టు చేయడంతో దీనిపై విచారణ అవసరం లేదని పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో నిందితుడు అయిన సుఖేష్ చంద్రశేఖర్...బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రాసిన లేఖ సంచలనంగా మారింది. తీహార్ జైల్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారు...మీతో పాటూ అరవింద్ కేజ్రీవాల్ కూడా వస్తారు అంటూ సుఖేష్ లేఖలో రాశారు.