Actor Darshan : దర్శన్ వీఐపీ ట్రీట్మెంట్.. ఏడుగురు అధికారుల సస్పెన్షన్!
నటుడు దర్శన్ కు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే విమర్శలతో కర్ణాటక ప్రభుత్వం ఏడుగురు అధికారులను విధుల నుంచి తొలగించింది.జైలు లోపల నుంచి దర్శన్ ఫోటోలు ఇంత పబ్లిక్ గా బయటకు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం తాజాగా స్పందించింది.