Darshan VIP Treatment : కన్నడ (Kannada) సినీ నటుడు దర్శన్ (Actor Darshan) తూగుదీపకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలతో ఏడుగురు అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ వున్న ఫొటో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దర్శన్ ఓ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. జైలులోపల దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందని ఈ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఈ విషయం గురించి స్పందించింది.
పూర్తిగా చదవండి..Actor Darshan : దర్శన్ వీఐపీ ట్రీట్మెంట్.. ఏడుగురు అధికారుల సస్పెన్షన్!
నటుడు దర్శన్ కు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే విమర్శలతో కర్ణాటక ప్రభుత్వం ఏడుగురు అధికారులను విధుల నుంచి తొలగించింది.జైలు లోపల నుంచి దర్శన్ ఫోటోలు ఇంత పబ్లిక్ గా బయటకు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం తాజాగా స్పందించింది.
Translate this News: