Darshan: జైల్లో ఉండలేకపోతున్నా..నన్ను చంపేయండి..నటుడు దర్శన్

బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని..భరించలేకపోతున్నానని..ఇక్కడ ఉండడం కంటే చచ్చిపోవడం బెటర్ అని అంటున్నాడు కన్నడ నటుడు దర్శన్. గదిలో దుర్వాసన వస్తోందని..ఫంగస్ బాగా భయపెడుతుందని చెబుతున్నాడు. 

New Update
Actor Darshan

రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం అతను బెంగళూరు పరప్పన జైల్లో ఉంటున్నాడు. ఈ కేసు విచారణ కోర్టులో నడుస్తోంది. అయితే తాను జైల్లో ఉండలేకపోతున్నానని..దాని కంటే ఇంత విషమిచ్చి చంపేయండి అని అంటున్నాడు.  విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిటీ సివిల్‌, సెషన్స్‌ కోర్టు ముందు హాజరైన దర్శన్‌..అగ్రహారం జైల్లో సరైన సదుపాయాలు లేవని గగ్గోలు పెడుతున్నాడు.  అసలు గదిలో గాలి కూడా ఆడడం లేదని...సూర్యుడిని చూసి చాలా రోజులు అయిందని చెబుతున్నాడు. గదిలో బట్టలతో సహా దుర్వాసన వస్తున్నాయని..ఫంగస్ తీవ్రత భయపెడుతోందని దర్శన్ అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బతకడం చాలా కష్టంగా ఉంది. నాకు విషమివ్వండి..జీవితం అత్యంత దుర్భరంగా ఉంది అని అంటున్నాడు. 

సుప్రీంకోర్టులో బిగ్ షాక్..

రేణుకాస్వామి హత్య కేసులో  కన్నడ నటుడు దర్శన్ కి సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ అతడి బెయిల్ ని రద్దు  చేసింది. దర్శన్ కి బెయిల్ ఇవ్వడానికి చట్టపరమైన కారణాలేవి లేవని  తెలిపింది. దర్శన్ ని త్వరగా అదుపులోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. జైల్లో దర్శన్  కి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరంలేదని ఆదేశించింది. నియమాలను ధిక్కరించి  జైల్లోని నిందితులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే కఠిన చర్యలు  తప్పవని అధికారులను హెచ్చరించింది. గతేడాది డిసెంబర్ 13న దర్శన్ కి కర్ణాటక హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

దర్శన్ తన సన్నిహితురాలు నటి  పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడనే కోపంతో రేణుకాస్వామి అనే అభిమానిని కిడ్నాప్ చేశాడు. అనంతరం అతడిని  చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు దాదాపు 17 మంది నిందితులుగా ఉన్నారు. అప్పట్లో  ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది. 

ఈ ఘటనకు సంబంధించి దర్శన్ పై కేసు నమోదవగా.. కొన్ని రోజులపాటు జైలు జీవితాన్ని కూడా గడిపారు నటుడు దర్శన్. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ 13న అతడికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్ ను రద్దు చేసింది. ''ఈ కేసు చాలా తీవ్రమైనది! ఇందులో చాలా మంది నిందితులు ఉన్నారు.నిందితుడి బెయిల్  సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది''  అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Advertisment
తాజా కథనాలు