![Darshan : అభిమానిని చంపి భార్య ఇంట్లో పూజలు చేసిన దర్శన్.. వెలుగు లోకి సంచలన విషయాలు!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-97.jpg)
Shocking Facts About Kannada Actor Darshan's Murder Case : కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) అభిమాని మర్డర్ కేసు లో ఇండస్ట్రీలో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఇటీవల రేణు స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసు లో దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి అన్ని వివరాలను సేకరించారు. తన ప్రియురాలు పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. రేణుకా స్వామి (Renuka Swamy) హత్య అనంతరం 9 వ తేదీ తెల్లవారుజామున హీరో దర్శన్ రేణుకా స్వామి మృత దేహాన్ని పారేసి హొస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి మైసూర్ బయలుదేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు పోలీసులు సమన్లు జారీచేసి బుధవారం ఐదు గంటలపాటు విచారించారు.
Also Read : మెగాస్టార్ ను కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్.. ఫోటోలు వైరల్!
ఇది జరిగిన మూడు రోజులకు దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు (Bangalore) లోని దర్శన్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. సూసైడ్ లెటర్‌తో పాటు వీడియోలో శ్రీధర్ పేర్కొన్నారు.