రేవంత్ పర్యటనలో రసాభాస | CM Revanth Reddy | Siddipet | RTV
రేవంత్ పర్యటనలో రసాభాస | CM Revanth Reddy | Siddipet | Certain Disrubances Took Place in the Public Meeting of Telangana's CM Revanth Reddy | RTV
రేవంత్ పర్యటనలో రసాభాస | CM Revanth Reddy | Siddipet | Certain Disrubances Took Place in the Public Meeting of Telangana's CM Revanth Reddy | RTV
మహిళల పట్ల హుజూరాబాద్ ఏసీపీ దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఆడవాళ్లను బూటు కాళ్లతో తంతావా నీ అంతు చూస్తా. త్వరలోనే నీ బాగోతం మొత్తం బయటపెడతా అంటూ ఏసీపీకి వార్నింగ్ ఇచ్చారు.
CM రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవ్గంలో కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లోని ఫుడ్ పార్క్‌లో రూ.1000 కోట్లతో నిర్శించిన కోకాకోలా కూల్ డ్రింక్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేశారు . సీఎంగా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లడం ఇదే ఫస్ట్ టైం.
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఇకపై ఊరుకోమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ను సీఎం రేవంత్ మొక్క అనడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ మొక్క కాదు.. వేగు చుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించారంటూ మండిపడ్డారు.
కలెక్టర్లకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సర్పంచ్‌పై వేటు వేసే అధికారాన్ని తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు వేస్తామని చెప్పారు. సోనియా గ్యారంటీగా తాను మాటిస్తున్నాననంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రైతు రుమాఫీ, బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుంటే బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరారు.
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులను ఆదేశించారు.
నాలుగో విడుతలో మూడు లక్షల మంది రైతులకు రూ.3000 కోట్లను శనివారం విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్‌నగర్‌లో ఈరోజు నిర్వహించనున్న రైతు పండుగలో సీఎం రేవంత్ దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు.