Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో రికార్డు.. ఒకే థియేటర్ లో 42 షోలు, ప్రభాస్ క్రేజ్ కు ఇదే నిదర్శనం!
తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' క్రేజ్ పీక్స్ కు చేరింది. తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కొత్తగా ఓపెన్ చేసిన 'అపర్ణ సినిమాస్' మల్టీప్లెక్స్ 'కల్కి' కోసం ఓపెనింగ్ డేనే 42 షోలు ఏర్పాటు చేసింది. ఈ అన్ని షోలకు టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.