Nag Ashwin : 'కల్కి' కోసం నా చెప్పులు కూడా అరిగిపోయాయి : నాగ్ అశ్విన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియాలో 'కల్కి' సినిమా కోసం పడ్డ కష్టాన్ని ఒకే ఒక్క పోస్ట్ ద్వారా తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీలో విరిగిన చెప్పుల ఫోటోను పంచుకున్నారు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ సినిమా చేయడానికి చాలా ఏళ్లు కష్టపడ్డామని తెలిపాడు. By Anil Kumar 27 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Director Nag Ashwin Efforts For Kalki 2898AD Movie : 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) గా మారిన ప్రభాస్ (Prabhas) మరోసారి 'కల్కి 2898AD' (Kalki 2898AD) తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద అభిమానులు భారీగా క్యూ కట్టారు. డ్రమ్స్ వాయిస్తూ, బాణాసంచా కాలుస్తూ ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. చెప్పులు అరిగేలా... ఇక సినిమా చూసిన జనాలు బ్లాక్‌బస్టర్ అంటూ సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. సినిమాలో ప్రభాస్ ఫైట్ సీన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఇక సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తన సోషల్ మీడియాలో సినిమా కోసం పడ్డ కష్టాన్ని ఒకే ఒక్క పోస్ట్ ద్వారా తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీలో విరిగిన చెప్పుల ఫోటోను పంచుకున్నారు. Also Read : ‘బిగ్ బాస్’ కు వెళ్లేందుకు 10 లక్షలు కట్టిన ‘జబర్దస్త్’ అవినాష్.. శ్రీముఖి దగ్గర అప్పు చేసి మరీ? డెడికేషన్ కు హ్యాట్సాఫ్... ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ సినిమా చేయడానికి చాలా ఏళ్లు కష్టపడ్డామని తెలిపాడు. దీంతో నాగ్ అశ్విన్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. దీన్ని చూసిన నెటిజన్స్ డైరెక్టర్ డెడికేషన్ చూసి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అంతేకాకుండా నాగ్ అశ్విన్ ను ఇండియన్ సినిమాకి ఫ్యూచర్ హాలీవుడ్ డైరెక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం మూవీ టీమ్ అంతా నాలుగేళ్లు శ్రమించారు. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొణె, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ తొలిరోజు రూ.90-100 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. #director-nag-ashwin #prabhas #kalki-2898-ad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి