Kalki 2898 AD: రికార్డులు బద్ధలే..ప్రపంచ వ్యాప్తంగా కల్కి మూవీ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా కల్కీ మూవీ ఫీవర్ పట్టి కుదిపేస్తోంది. మొదటిరోజే రికార్డ్‌లను బద్దలు చేస్తోంది. USతో సహా అన్ని దేశాల్లో మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీని మించి కలెక్షన్లను సాధించిందని చెబుతున్నారు. By Manogna alamuru 27 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తొలిరోజే కల్కి 2898 ఏడీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. US సహా ఓవర్సీస్‌లో కల్కీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన ప్రతిచోట హౌస్ ఫుల్ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ రూ.200 కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా.తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా కల్కీ రికార్డు సృష్టించిందని ఫిల్మ్ పండితులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఫస్ట్ వీకెండ్ రూ.500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియాలో కల్కి మూవీ తొలి రోజే రూ.120-140 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఇదే రికార్డని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. బాహుబలి, RRRను మించిన ఫస్ట్ డే కలెక్షన్లను కల్కి మూవీ రాబట్టింది అని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ 3.46 మిలియన్ డాలర్లు రాబడితే...ప్రభాస్ కల్కి మూవీ 3.7 మిలయ్ డాలర్లు సంపాదించుకుంది. వీకెండ్‌లో ఇది ఇంకా పెరుగుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు విశ్లేషకులు. నాగ్ అశ్విన్ దర్శకత్వం చేసిన కల్కి 2898ఏడీ మూవీలో ప్రభాస్, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించారు. Also Read:Andhra Pradesh: ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు చిక్కిన చిరుత #kalki-2898-ad #records #telugu #movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి