Breaking : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సీఎం జగన్ ఘటనపై ఘాటుగా స్పందించారు. జగన్ ప్రాణానికి భద్రత లేదు, గ్యారంటీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను సిరియన్గా తీసుకొని జగన్ భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కొడుకును కసాయి తండ్రి కొట్టి చంపాడు. ముస్తకీమ్ అనే చిన్నారిపై సవతి తల్లి చాడీలు చెప్పడంతో తండ్రి ఇమ్రాన్ బాబును చావబాదాడు. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడపలో వైఎస్ వివేకా హత్యపై ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన వాఖ్యలు వాస్తవమన్నారు టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి. వైసీపీ పార్టీ రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ విజయమ్మ ఎవరి వైపో ప్రజలకు తెలుపాలని అన్నారు.
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
కడప జిల్లాలో టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న చెంగల్రాయుడికి టికెట్ రాకపోవడంతో అతని అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. భారీ ర్యాలీలు నిర్వహిస్తూ తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు.
ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కేడే ఇద్దరు మృతి చెందారు. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్ళుతుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతులు నడింపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డిగా గుర్తించారు.
ఉమ్మడి కడప జిల్లాలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోందన్నారు. వైసీపీ నేతల భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.