Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్..తప్పుల సవరణకు శనివారం నుంచి ఛాన్స్..!
గ్రూప్-1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 10గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెల్లడించారు.