/rtv/media/media_files/2025/09/24/unemployed-strike-2025-09-24-14-49-33.jpg)
unemployed strike
TG News: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ తెలంగాణ నిరుద్యోగ యువత మరోసారి రోడ్డుకెక్కారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.నిరుద్యోగుల ఆందోళనతో మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోలేనట్లు తెలుస్తోంది. ప్లకార్డులు, బ్యానర్లతో నినాదాలు చేస్తూ ధర్నాను కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరుద్యోగుల నిరసన
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2025
దిల్సూఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ pic.twitter.com/NqL5yDsCm3