Japan Earthquake: వణుకుపుట్టించే భూకంపం.. సునామీ అలర్ట్ - వరుసగా ఏడోసారి

తాజాగా జపాన్‌లోని తూర్పు తీరంలో ఒక పెద్ద భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. ఇవాటే ప్రిఫెక్చర్‌లోని యమడా నగరానికి తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించింది.

New Update
Japan Earthquake

Japan Earthquake

గత కొన్ని రోజులుగా భూకంపాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా జపాన్‌లోని తూర్పు తీరంలో ఒక పెద్ద భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. ఇవాటే ప్రిఫెక్చర్‌లోని యమడా నగరానికి తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించింది. భూకంపాలు తరచుగా సంభవించే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేసింది.  

Japan Earthquake

ఈ భూకంపం జపాన్ స్థానిక కాలమానం ప్రకారం.. ఈరోజు సాయంత్రం 5:03 గంటలకు సంభవించింది. దీని కేంద్రం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఇవాటే ప్రిఫెక్చర్ సమీపంలో ఉంది. భూకంపం ప్రకంపనలు చుట్టుపక్కల ప్రాంతాలలో బలంగా ఉన్నాయి. మియాకో, యమడా వంటి తీర ప్రాంతాలలో 1 మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అంచనా వేశారు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక జారీ చేశారు. 

అదృష్టవశాత్తూ పెద్దగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. అనంతర ప్రకంపనల కోసం పర్యవేక్షణ ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండటం ముఖ్యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో సంభవించిన 7వ భూకంపం ఇది. అంతక ముందు ఉదయం 6:04 గంటలకు 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఆ తర్వాత ఉదయం 7:33 గంటలకు 5.0 తీవ్రత, ఉదయం 5.6 తీవ్రత, ఉదయం 12:17గం. 5.1 తీవ్రత, ఇప్పుడు ప్రధాన భూకంపానికి ముందు 5.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. గత 24 గంటల్లో 5.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో కనీసం ఏడు భూకంపాలు నమోదయ్యాయి. చిన్న చిన్న భూకంపాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు