Pawan Kalyan : పవన్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ..ఈ సారి కూడా అక్కడి నుండే పోటీ చేస్తారా?
టీడీపీ, జనసేన పొత్తులో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో కేవలం 5 చోట్ల అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. మిగిలిన 19 సీట్లలో పవన్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారోనని ఆసక్తి కనిపిస్తోంది.