Janasena: కక్ష సాధింపేనా? జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లలో పోలీసుల తనిఖీలు!
మంగళగిరిలో పవన్ సెక్యూరిటీ, కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ప్లాట్లలో పోలీసులు తనిఖీల చేయడాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాత్రి 10 గంటలకు పోలీసులకు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకొని అక్కడికి వచ్చారో చెప్పాలన్నారు.