Pawan Politics: హమ్మయ్య ఆంధ్రప్రదేశ్ లో విపక్షాల పొత్తులు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుదలతో.. ఐదేళ్లుగా ఎడ మొహం-పెడ మొహంగా ఉన్న టీడీపీ, బీజేపీ మధ్య వారధిగా నిలబడి రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విజయం సాధించారు. అవును.. తెలుగుదేశం, బీజేపీల మధ్య సయోధ్య కుదరటానికి పవన్ కళ్యాణ్ పట్టుదలే కారణం అనేది నిర్వివాదాంశం. వైసీపీని ఎలాగైనా అధికార పీఠం నుంచి కిందకు దించాలనే పట్టుదలతో పవన్ కళ్యాణ్ (Pawan Politics)మొదటి నుంచి ఉన్నారు. ఎన్నికల సమయానికి మరింత గట్టిగా విపక్షాలు అన్నీ ఏకమైతే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందంటూ.. దాని కోసమే ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ విపక్షాల కూటమిని సిద్ధం చేశారు. ఇదంతా చాలా బావుంది. పైకి చాలా చక్కగా కనిపిస్తోంది. అధికారపక్షం ఒక్కటీ ఒకవైపు.. విపక్షాలన్నీ కలిసి కట్టుగా మరోవైపు.. విజయం ఖాయమనే అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉన్నాయి. కాగితాల లెక్కలు కూడా అదే చెబుతాయి. కానీ, పవన్ కళ్యాణ్(Pawan Politics) పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అటు టీడీపీ, ఇటు బీజేపీ రెండిటిని కలపడం కోసం ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలంటూ తనని తాను.. తన పార్టీని తనకున్న బలంకంటే చాలా తక్కువకు తగ్గించేశారా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్న ప్రశ్న.
పూర్తిగా చదవండి..Pawan Politics: ముక్కూటమి కుదిరింది.. జనసేనానికి త్యాగమే మిగిలిందా?
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల అధ్యాయం మొదలైంది. మూడుపార్టీలు కూటమి కట్టాయి. దీనికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి కారణం. అయితే, ఇప్పుడు పవన్ రాజకీయంగా భారీ త్యాగాలు చేసే పరిస్థితిలో పడ్డారా? ఏపీలో ముక్కూటిమి..పవన్ వ్యూహం.. విశ్లేషణాత్మక కథనం కోసం టైటిల్ పై క్లిక్ చేయండి.
Translate this News: