Janasena: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సమన్వయ కమిటీ నియామకం: జనసేన
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పార్టీ తరఫున సమన్వయం కోసం ఓ కమిటీని నియమించారు. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. దీనికి పార్టీ ఉపాధ్యాక్షులు బొంగునూరి మహేంధర్ రెడ్డి సమన్వయకర్తగా పనిచేస్తారు.