Janasena Party: జనసేనకు భారీ షాక్

AP: పవన్‌కు ఊహించని షాక్ తగిలింది. అమలాపురం పార్లమెంటరీ ఇంఛార్జి శేఖర్ జనసేనకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపారు. టికెట్ రాకపోవడంతో గత కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.

New Update
Janasena Party: జనసేనకు భారీ షాక్

Janasena Party: ఏపీలో అసెంబ్లీ ఎన్నకలకు మరో 25 రోజుల సమయం ఉన్న తరుణంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు వరుస రాజీనామాలు వెల్లువెత్తాయి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి శేఖర్ జనసేనకు రాజీనామా చేశారు. తన రాజినామా లేఖను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు పంపారు. టికెట్ రాకపోవడంతో గత కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.

ALSO READ: లిక్కర్ స్కాం కేసులో కవిత షాక్.. ఉచ్చు బిగిస్తున్న సీబీఐ

ఇప్పటికే కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, అమలాపురం ,రాజోలు నియోజకవర్గ ఇంఛార్జిలు జనసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అమలాపురం నియోజకవర్గం ఇంఛార్జి శెట్టిబత్తుల రాజబాబు ఇప్పటికే రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇప్పుడు జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న డిఎంఆర్ శేఖర్ రాజీనామా చేయడంతో అమలాపురంలో జనసేన ఖాళీ ఖాళీ అయింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు