Srinagar: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు సైనికులు మృతి!
జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ అటవి ప్రాంతంలో భీకరమైన కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.