జమ్మూలో ఖాతా తెరిచిన ఆప్.. భారీ మెజార్టీతో మాలిక్‌ విజయం!

జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో ‘ఆప్‌’ తొలి విజయం సాధించింది. దోడా నియోజకవర్గంనుంచి ఆప్‌ అభ్యర్థి మెహ్రాజ్‌ మాలిక్‌ 4538 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయంతో ఆప్ 5 రాష్ట్రాలకు విస్తరించింది.

New Update
dferere3r

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా తెరిచింది. దోడా నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి మెహరజ్‌ మాలిక్‌ 4,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో ఢిల్లీ, పంజాబ్‌ తోపాటు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం లభించగా.. మొత్తంగా 5 రాష్ట్రాలకు విస్తరించింది. గోవా, గుజరాత్‌లో ఆప్ ఎమ్మెల్యేలున్నారు. 

ఇది ప్రజల విజయం..

ఇక ఈ విజయంపై మీడియాతో మాట్లాడిన మాలిక్.. ‘ఇది ప్రజల విజయం. నన్ను నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నా. ప్రజల బాధలను చూస్తూ కూర్చునే వ్యక్తులం కాదు. బాధితుల తరఫున నిరంతరం పోరాటం చేస్తాం.  వ్యక్తిగత పోరాటాలుండవు. అన్నీ ప్రజలకోసమే' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 2013లో ఆప్ లో చేరిన మాలిక్‌ 2020లో డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆయన గెలిచిన దోడా స్థానాన్ని 2014లో బీజేపీ గెలిచింది. 

హరియాణాలో తప్పని నిరాశ..

ఇదిలా ఉంటే.. 2014 నుంచి హరియాణాలో ఆప్‌కు నిరాశే మిగిలింది. ఈసారి ఒంటరిగా పోటీ చేయడంతో ఒక్క చోట విజయం దక్కలేదు. కేవలం 1.77శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. ఇది ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్‌ కేజ్రీవాల్‌కు కలవరపెట్టే అంశంగానే భావింవచ్చు. 2019లోనూ 46 సీట్లలో ఓటమి పాలైంది. 

Advertisment
తాజా కథనాలు