CM YS Jagan: సీఎం జగన్ కారును ఢీకొన్న మరో కారు.. తృటిలో తప్పిన ప్రమాదం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. నెమళ్ల పార్క్ నుంచి ఇడుపులపాయకు వెళ్తుండగా కాన్వాయ్ లో వెనుక వస్తున్న కారు ఆయన కారును ఢీకొట్టింది. దీంతో జగన్ వాహనం దిగి మరో కారులో ఇడుపులపాయకు వెళ్లారు.