YS Jagan Car Seized : సింగయ్య మృతిపై యాక్షన్‌..జగన్‌ బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్‌

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కి పోలీసులు షాక్‌ ఇచ్చారు. పల్నాడు జిల్లా పర్యటన లో చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు యాక్షన్‌ స్టార్ట్‌ చేశారు. జగన్‌ కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.

New Update
YS Jagan Car Seized

YS Jagan Car Seized

YS Jagan Car Seized:  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కి పోలీసులు షాక్‌ ఇచ్చారు. పల్నాడు జిల్లా పర్యటన లో చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు యాక్షన్‌ స్టార్ట్‌ చేశారు. ప్రభుత్వం ఈ వివాదాన్ని వదిలేలా లేదు. ఈ విషయంలో పోలీసులు దూకుడు పెంచారు. ప్రమాదంపై బయటకు వచ్చిన వీడియోలను ఆధారం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అందులో భాగంగా.. ఈ రోజు వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.. 

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నల్లపాడు పోలీసులు.. పార్టీ కార్యాలయ ఇంఛార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి దీనికి సంబంధించి నోటీసులు అందజేశారు.. ఇటీవల జగన్.. సత్తెనపల్లి పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్త జగన్‌ కారు కింద పడి మరణించిన ఘటనపై విచారణ జరుపుతున్నామని వారు తెలిపారు. అలాగే జగన్‌ వాహనం డీకొనడం వల్లే సింగయ్య మృతి చెందాడని నిర్ధారించిన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేశామని నల్లపాడు పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో వాహన డ్రైవర్‌తో పాటు జగన్‌ మరికొందరిపై కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు