Israel - Hezbollah: మరో యుద్ధం జరగనుందా ?.. సై అంటే సై అంటున్న ఇజ్రాయెల్ - హెజ్‌బొల్లా ప్రస్తుతం ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు క్షిపణి దాడులు చేసుకుంటున్న వేళ.. త్వరలోనే ఇవి పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగనున్నాయా అనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో యుద్ధం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో పారాడేందుకు హెజ్‌బొల్లా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. By B Aravind 30 Jun 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Israel - Hezbollah War: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ (Israel), హెజ్‌బొల్లాలు (Hezbollah) క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. అయితే త్వరలోనే ఇవి పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగనున్నాయా అనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో యుద్ధం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న పోరాటం వల్ల ఇప్పటికే పశ్చిమాసియాలో భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. మళ్లీ ఇంకోసారి యుద్ధం జరిగితే పరిస్థితులు మరింత దిగజారిపోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌తో పారాడేందుకు హెజ్‌బొల్లా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలే ఇజ్రాయెల్‌లోని పలు కీలక సైనిక, నౌక స్థావరాలను డ్రోన్ల ద్వారా షూట్ చేసి దానికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే హెజ్‌బొల్లా చేసిన వరుస క్షిపణి (Missiles), డ్రోన్ల దాడుల వల్ల ఇజ్రాయెల్‌లోని ఉత్తర ప్రాంత ప్రజలు చాలాకాలంగా తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. అయితే పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగితే తమకు ముప్పు తప్పదని భావిస్తున్న ఇజ్రాయెల్.. హెజ్‌బొల్లాతో తేల్చుకునే సమయం వచ్చందని ప్రకటన చేసింది. Also read: ‘మత విశ్వాసమే నన్ను నడిపిస్తోంది’.. హిందూ ధర్మంపై రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు ఇందుకోసం ఇజ్రాయెల్ పూర్తిస్థాయిలో యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలు కావచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. ఇక డ్రోన్ల వీడియోను చూపిస్తూ.. పరిమితులు, నిబంధనలు లేని యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఘర్షణను విస్తరించాలని చూస్తే తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తే ఐరోపా కూటమిలో ఉన్న సైప్రస్‌పై దాడి చేస్తామని నస్రల్లా హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్.. లెబనాన్‌పై దాడి చేస్తే తాము యుద్ధంలోకి దిగుతామని ఇరాన్ (Iran) హెచ్చరిస్తోంది. అయితే ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే మధ్యలో ఇరాన్ ప్రవేశించకుండా చూడాలని సూచిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ - హెజ్‌బొల్లా మధ్య జరిగిన దాడుల్లో 400 మంది మరణించారు. Also Read: పెళ్ళి మండపంలో ఆత్మాహుతి దాడి.. 18మంది మృతి..19మంది పరిస్థితి విషమం! #telugu-news #israel #israel-hezbollah #hezbollah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి