Biden: నస్రల్లా హత్య న్యాయమైన చర్య: బైడెన్!
హెజ్బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యాయమైన చర్యగా సమర్థించారు. నస్రల్లా కారణంగాహెజ్బొల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతి చెందినట్లు బైడెన్ తెలిపారు.
హెజ్బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యాయమైన చర్యగా సమర్థించారు. నస్రల్లా కారణంగాహెజ్బొల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతి చెందినట్లు బైడెన్ తెలిపారు.
ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత నస్రల్లా మరణించారు. అసలెవరికీ బయటకు కనిపించిన ఆయన ఆచూకీని ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది. ఎప్పటి నుంచి నస్రల్లా మీద ఇజ్రాయెల్ నిఘా పెట్టింది. వివరాలు ఈ కింది ఆర్టికల్‌లో చదవండి.
ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా చనిపోయాడని ఇజ్రాయెల్ భద్రతా దళం శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. అతని కూతురు కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నస్రల్లా ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
ఇజ్రాయెల్.. లెబనాన్ వ్యాప్తంగా శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరూట్ లోని హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ మృతి చెందినట్లు సమాచారం.
హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మృతి చెందారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అలాగే మరో 90 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని పేర్కొంది.
హమాస్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. అతడు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైనిక దళాలు కూడా భావిస్తున్నాయి. ఇటీవలే హమాస్ సొరంగాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లోని క్వాబాటియా నగరంలో కీలక ఉగ్ర కమాండర్ షాదీ జకర్నే హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఈ కాల్పుల్లో మొత్తం నలుగురు గన్మెన్లను సైనికులు మట్టుబట్టారు.
లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీంతో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకెళ్లకుండా నిషేధం విధించింది.
పేజర్లను వాడితే ఇజ్రాయెల్ కు దొరక్కుండా ఉండొచ్చని హెజ్బొల్లా వ్యూహకర్తల ప్లాన్. చాలా కాలం నుంచి వీటిని ఉపయోగిస్తున్నారు.తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్ లో దాదాపు 3,000 పేజర్లను లెబనాన్ కు దిగుమతి చేసుకుంది.