అరబ్, అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్‌ మాస్ వార్నింగ్‌..

అరబ్, అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్‌ మాస్ వార్నింగ్‌ ఇచ్చింది. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని దీనిపై తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది హెచ్చరించింది.

New Update
iran warns israel

పాలస్తీనా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. అదే సమయంలో వాటికి మద్దతుగా ఇరాన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌పై ప్రత్యక్షంగా దాడులకు దిగింది. దీంతో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉండే ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఉంటున్నారు. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్‌ని మట్టుబెడుతుంటే.. ఇరాన్ సైతం తమ దాడులతో రాకెట్లు ప్రయోగిస్తుంది. ఈ యుద్ధంలో అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. ఈ తరుణంలో అరబ్ దేశాలకు, అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.

ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి

ఈ మేరకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇజ్రాయెల్‌కు సహాయం చేస్తే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. తమపై దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ సాయం చేయవద్దని తెలిపింది. అలా చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని, అలాంటి పరిస్థితులు ఎదురైతే మాత్రం తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని బెదిరించింది.

ఇది కూడా చదవండి: ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే?

సౌదీ అరేబియా, జోర్డాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్యంగా ఈ హెచ్చరికలు పంపింది. అయితే వీటికే ఎందుకు హెచ్చరికలు పంపిందంటే.. ఇవన్నీ యూఎస్ సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు.  

ఇది కూడా చదవండి: మొగులయ్యకు అన్యాయం.. ప్రభుత్వం ఇచ్చిన 15 రోజులకే ధ్వంసం!

ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తున్న అమెరికా సైతం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ దేశంపై కొన్ని ఆంక్షలు విధిచింది. ఇందులో భాగంగానే ఇరాన్‌కు నిధులు ఇచ్చే మార్గాలను దెబ్బతీయాలని చూస్తోంది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై అమెరికా ఆంక్షలు పెంచినట్లు ట్రెజరీ డిపార్టుమెంట్ తెలిపింది. ఈ తరుణంలోనే 16 సంస్థలకు, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్లీగా గుర్తించినట్లు పేర్కింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు