ఇజ్రాయెల్ పై భారీ దాడులు.. వరుస రాకెట్లు ప్రయోగించిన హెజ్బుల్లా

ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా విరుచుకుపడింది. మంగళవారం వరుస రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ పౌరులను ఖాళీ చేయించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 170 రాకెట్లను హెజ్బుల్లా ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

New Update
Israel - Hezbollah: మరో యుద్ధం జరగనుందా ?.. సై అంటే సై అంటున్న ఇజ్రాయెల్‌ - హెజ్‌బొల్లా

ఇజ్రాయెల్ - హెజ్బుల్లా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. రెట్టింపు రాకెట్ల దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఇందులో ఇజ్రాయెల్ వరుస దాడులతో హెజ్బుల్లాను వణికిస్తోంది. వరుస రాకెట్లు ప్రయోగించి ఉగ్రరూపం చూపిస్తోంది. తాజాగా హమాస్, బీరుట్ పై బాంబుల వర్షం కురిపించింది. బీరుట్ లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై రాకెట్లు, క్షిపణులతో భీకర దాడులు చేసింది.

ఇది కూడా చదవండిః ఇజ్రాయెల్ ఉగ్రరూపం..హెజ్బుల్లా సర్వనాశనం దిశగా దాడులు

ఈ దాడుల్లో హెజ్బుల్లా కీలక కమాండర్ సోహిన్ సుహైల్ హొసైనీ హతం అయ్యారని ఇజ్రాయెల్ వెల్లడించింది. అదే సమయంలో దాదాపు వందలాది మంది హెజ్బుల్లా మిలిటెంట్లు కూడా మరణించారు. ఇజ్రాయెల్ రాకెట్ల దాడికి హెజ్బుల్లా ప్రధాన కార్యలయం ముక్కలు ముక్కలైంది. 

170 రాకెట్లతో దాడి

కాగా దీనికి ప్రతీకారంగా హెజ్బుల్లా మంగళవారం ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులతో విరుచుకు పడింది. వరుస రాకెట్లు ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ పౌరులను ఖాళీ చేయంచాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే హెజ్బుల్లా వరుస రాకెట్లను ప్రయోగించింది.  

ఇది కూడా చదవండిః మరో కీలక నేతను కోల్పోయిన హెజ్‌బొల్లా!

ఇజ్రాయెల్ లోని హైఫా దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బుల్లా రాకెట్లను వదిలింది. మొత్తం 170 రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అదే సమయంలో దక్షిణ లెబనాన్ కు మరిన్ని బలగాలను పంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు