యహ్యా సిన్వార్ మృతిపై హమాస్ కీలక ప్రకటన
ఇటీవల గాజా స్ట్రిప్‌లో చేసిన దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హమాస్ కూడా దీనిపై స్పందించింది. తమ నాయకుడు యహ్యా సిన్వార్ మృతి చెందినట్లుగా ధ్రువీకరించింది.