Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు.