Heavy Rains : బుధవారం సాయంత్రం ఢిల్లీ (Delhi) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడిది అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాల వల్ల ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..నీరు ఉద్ధృతంగా ప్రవాహిస్తున్న ఓ ప్రాంతంలో ఓ మహిళ, తన బిడ్డతో కలిసి వెళ్తున్న సమయంలో డ్రైనేజీలో జారిపడి ఇద్దరు మృతి చెందారు. గురుగ్రామ్‌లో భారీ వర్షానికి హైటెన్షన్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. గ్రేటర్ నోయిడా (Greater Noida) లోని దాద్రీ ప్రాంతంలో గోడ కూలి ఇద్దరు మృతి చెందారు.
#6ETravelAdvisory : #Delhi | We want to keep you informed that our departures and arrivals are still experiencing delays, which may continue through the morning. We understand that waiting through the night can be bothersome and inconvenient, and we sincerely regret the (1/3)
— IndiGo (@IndiGo6E) July 31, 2024
కుండపోత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 10 విమానాలను దారి మళ్లించారు. వీటిలో ఎనిమిది విమానాలను జైపూర్‌కు, రెండు లక్నోకు విమానాశ్రయ అధికారులు దారి మళ్లించారు. కుండపోత వల్ల 10 విమానాలను ఢిల్లీ విమానాశ్రయంలో రద్దు చేస్తున్నట్లు అధికారులు ట్విటర్ (X) వేదికగా తెలియజేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య దేశ రాజధానిలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. ఢిల్లీ నగరానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షపాతం ఆగస్టు 5 వరకు ఢిల్లీలో కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది.
आज दिल्ली व उत्तर प्रदेश की खोड़ा कॉलोनी की सीमा पर डीडीए द्वारा बनाये जा रहे नाले में किसी भी प्रकार की बेरिकाडिंग ना होने की वजह से, एक महिला और उनकी 2.5 साल की बच्ची की उस नाले में गिरने से मौत हो गई
मैं उम्मीद करता हूँ कि DDA के इन लापरवाह अफसरो पर @LtGovDelhi साहब सख़्त से… https://t.co/pUZdZyJYQw
— MLA Kuldeep Kumar (@KuldeepKumarAAP) July 31, 2024
దేశ రాజధానిలో బుధవారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య 79.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మయూర్ విహార్ వంటి ఇతర ప్రాంతాలలో 119 మిమీ, పూసా 66.5 మిమీ, ఢిల్లీ యూనివర్సిటీ 77.5 మిమీ, పాలం అబ్జర్వేటరీ 43.7 మిమీ వర్షం నమోదైంది. ఢిల్లీ గరిష్ఠ ఉష్ణోగ్రత పగటిపూట 37.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనూజ (22), ఆమె మూడేళ్ల కుమారుడు వీక్లీ మార్కెట్లో గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు బయటకు వస్తుండగా నీటి ఎద్దడి ఉన్న కాలువలో పడి మునిగిపోయారు. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డు పక్కన డ్రెయిన్ నిర్మాణంలో ఉందని, ఆరు అడుగుల వెడల్పుతో 15 అడుగుల లోతు ఉందని పోలీసులు తెలిపారు. తల్లీ కొడుకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇల్లు, పాఠశాల గోడ కూలి…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో ఒక ఇల్లు కూలి, ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఐదు అగ్నిమాపక యంత్రాలు, భారీ వర్షం మధ్య వచ్చే సమయంలో ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొన్నాయి. వసంత్ కుంజ్‌లో జరిగిన మరో సంఘటనలో, గోడ కూలిపోవడంలో ఒక మహిళ గాయపడింది. అలాగే, భారీ వర్షాల మధ్య దర్యాగంజ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల గోడ కూలి, సమీపంలో ఆగి ఉన్న కారు పూర్తిగా ధ్వంసమైంది.
రాజధానిలో ట్రాఫిక్ జామ్‌లు
కుండపోత కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు కీలక ప్రాంతాలు నీట మునిగాయి, అండర్‌పాస్‌లు వరదల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా లుటియన్స్ ఢిల్లీలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ఓల్డ్ రాజేంద్ర నగర్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ బేస్మెంట్లో వరదల కారణంగా ముగ్గురు విద్యార్థులు మరణించారని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
అవసరమైతేనే బయటకు రండి..!
ఈ క్రమంలో ఢిల్లీలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Also Read : కేసీఆర్‌కు మరో ఝలక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే?
[vuukle]