/rtv/media/media_files/2025/03/16/ncFG369Ea2Wb7klq0SzM.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20లో కూడా ఘోర ఓటమిని చవిచూసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఘోర ఓటమిని దృష్టిని పెట్టుకుని పాక్ క్రికెట్ బోర్డు కివీస్ టూర్ కోసం జట్టులో మార్పులు చేసింది. కెప్టెన్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు.
Also read : Karnataka: రోజుకో రకంగా వాంగ్మూలం..తికమక పెడుతున్న రన్యారావు
Also read : ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
New Zealand Beat Pakistan by 9 Wickets in First T20I #PAKvsNZpic.twitter.com/7S319wSjYk
— IMMY k (@Name_is_Immy) March 16, 2025
91 పరుగులకే ఆలౌట్
క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాంటింగ్ చేసిన పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ గడ్డపై పాక్ కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్. ఖుష్దిల్ షా 32(30), అఘా సల్మాన్ 18(20) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4, కైల్ జామిసన్ మూడు వికెట్లు తీశాడు. ఆ తరువాత 92 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ జట్టు 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. టిమ్ సీఫెర్ట్ 44(29),ఫిన్ అలెన్ 29(17) పరుగులు చేసి జట్టును గెలిపించారు. దీంతో 9 వికెట్లతో విజయం సాధించి సిరీస్ లో ముందంజలో ఉంది.
Pata chal gya ho ga @icc T20 team Mai aana her kisi k bs ke baat nhi @iMRizwanPak aur @babarazam258 ke 8 hundred partnerships hai T20 internationals Mai
— Naik_sameer (@Naiksameer19) March 16, 2025
Ye londey @TheRealPCB ke sare kamaye pey Pani fher deinge #Rizbar#PAKvsNZpic.twitter.com/Iigufyw3eF
Also Read : Hydra: రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ‘స్పెషల్ పోలీస్‌స్టేషన్, పత్యేక కోర్టులు’
Also read : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్