గెలుపుపై మనదే | Indian Fans Reaction On Final Match | ICC Champions Trophy 2025 | RTV
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌ను వీక్షేంచేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నేడు దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు ఐసీసీ ప్రైజ్ మనీ కింద రూ.19.5 కోట్లు ఐసీసీ ఇవ్వనుంది. రన్నరప్ జట్టుకు రూ.9.78 కోట్లు ఇస్తారు. సెమీసీలో ఓడిపోయిన జట్టులకు రూ. 4.89 కోట్లు లభిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విజేత ఎవరనే దానిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్స్‌ను ప్రశ్నించగా భారత్ వైపే మొగ్గు చూపాయి. ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉన్నప్పటికి భారత్ వైపే గెలుపు అవకాశాలు ఉన్నాయని గూగుల్ జెమిని తెలిపింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలవకూడదని మాజీ స్పిన్నర్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. గత11 మ్యాచ్‌ల్లో టీమిండియా టాస్ ఓడిపోయినప్పటికీ చక్కటి ప్రదర్శనను కనబరుస్తోందని అభిప్రాయపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో పేసర్ ను ఎదురుకునే క్రమంలో కోహ్లీకి గాయమైంది. మోకాలికి దగ్గర గాయం కావడంతో వెంటనే కోహ్లీ ప్రాక్టీస్ ఆపేయగా... స్ప్రే వేసి, ఆ ప్రాంతాన్ని కట్టుతో కట్టారని తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ కు టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ ఫైనల్లో ఆడటం సందేహంగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ టైమ్ లో హెన్రీ భుజానికి గాయం అయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, కివీస్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌కి బిగ్ షాక్ తగలనుంది. స్టార్ పేసర్ మాట్ హెన్రీ రెండో సెమీస్‌లో క్యాచ్ పట్టుకునే సమయంలో భుజానికి గాయం తగిలింది. ఫైనల్‌కి గాయం తగ్గకపోతే టోర్నీ నుంచి ఔట్ అయ్యినట్లే.
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తిని సంతరించుకుంది.