Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్!
దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
హైడ్రాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయబద్దమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్పును పాలించాల్సిందేనని తేల్చి చెప్పింది.
హైదరాబాద్‌లోని కంట్రీసైడ్ రియల్టర్స్ కంపెనీ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా యజమానుల ఫిర్యాదు మేరకు వారిపై FIR రిజిస్టర్ చేశారు.
హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహీంద్ర షో రూం వెనుక ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఇంటి అద్దె చెల్లించలేదని ఓ యువతిపై యజమాని కత్తితో దాడి చేశాడు. వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితరాలి కుటుంబ సభ్యులు యజమానిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేశారని పగపెంచుకున్న బల్వీర్ అనే యువకుడు ఆమె తండ్రిపై ఎయిర్ పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆదివారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మజ్లిస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో అనేక ఏండ్లుగా మజ్లిస్ నేతలు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా సామాన్యులకు ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు. వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మల్లారెడ్డి హాస్పిటల్లో డెడ్‌బాడీకి ట్రీట్మెంట్ చేశారని రిపోర్టింగ్ చేస్తుండగా ఆర్టీవీ రిపోర్టర్లు విజయ్, సాగర్, కెమెరా మెన్లపై మల్లారెడ్డికి చెందిన 15 మంది బౌన్సర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రిపోర్టర్ విజయ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది.