Pizza: పిజ్జా ఆర్డర్ చేశారని.. హాస్టల్ వార్డెన్ ఏం చేసిందంటే?
మహారాష్ట్రలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని నలుగురు బాలికలు పిజ్జా ఆర్డర్ చేశారని వార్డెన్ వారిని హాస్టల్ నుంచి బహిష్కరించింది. ఒక నెల రోజుల పాటు హాస్టల్‌కి ఎంట్రీ లేదని తెలిపింది. బాలికల తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఆ వార్డెన్ ఒప్పుకోలేదు.
ACB attacks : ఏసీబీ వలలో హాస్టల్ వార్డెన్
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ నాగమణి ఏసీబీకి చిక్కారు.
GIRL INJURED : ఎస్సీ బాలికల హాస్టల్లో ఊడిపడ్డ ఇనుప పైపు..తర్వాత ఏమైందంటే...
హాస్టల్లో విద్యార్థిని తలపై ఇనుప పైపు పడడంతో గాయాలైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థిని హాస్టల్ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడింది. దీంతో తలకు తీవ్ర గాయం కాగా వార్డెన్ స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Psycho : సైకో పీఈటీ.. బాలికలు స్నానం చేస్తుంటే వీడియోలు తీసి దారుణం!
పీఈటీ టార్చర్ తట్టుకోలేక సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు రోడ్డెక్కారు. స్నానం చేస్తుంటే సెల్ ఫోన్లో వీడియోలు తీసి టార్చర్ చేస్తుందంటూ నిరసన చేపట్టారు. పీరియడ్స్ టైమ్‌లోనూ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Hyderabad : అంధ బాలికపై అత్యాచారం..హైదరాబాద్‌లో దారుణం
అంధ బాలికల వసతి గృహంలో అమానుషం జరిగింది.హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో 8 ఏళ్ల అంధ బాలికపై కామాంధుడు లైంగిక దాడి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు.
Mannanur: మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి అస్వస్థత
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకొని సృహ కోల్పోయిన 14 మంది విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది స్థానిక అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.