AP News: ఏపీలో విషాదం.. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి!
ఏపీ శ్రీకాకుళం లంకపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయగా కాంతమ్మ, సూరి అనే ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స కోసం విశాఖ కెజిహెచ్ కు తరలించారు.