Weather Alert : భారీ వర్షాలు.. 11 మంది మృతి
కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.
కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.
బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రేపు ఉదయానికి ఇది తుపానుగా మారనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో మే 27 వరకు ఉత్తర, బెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు మరో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.
TG: ఈరోజు నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, SRCL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల సుమారు 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శనివారం రాత్రి ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని అధికార ప్రతినిధి ఇస్మతుల్లా మురాది తెలిపారు.
జూన్ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని.. జూన్ మొదటివారంలో ఏపీలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 25 వర్షాలు ఉంటాయని పేర్కొంది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బెంగళూరు వాసులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు బెంగళూరు నగరానికి యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మే 16 నుంచి 21 వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది.