TS Elections 2023: అలా జరిగితే మేమే కింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న బీజేపీ లెక్కలివే! తాము 22 స్థానాల్లో సత్తా చాటడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అదే జరిగితే తామే కీలకం అవుతామని అంచనా వేసుకుంటున్నారు. ఒక వేళ బీజేపీ లెక్కలు నిజమైతే పార్లమెంట్ ఎన్నికల వరకూ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 02 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections 2023) సంబంధించిన ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్ లు కాంగ్రెస్ కే ఆధిక్యం అని స్పష్టం చేయగా.. కొన్ని బీఆర్ఎస్ కు (BRS) అధికారం అని చెప్పాయి. అయితే.. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. హంగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. అయితే.. హంగ్ వస్తే తామే కింగ్ అవుతామని బీజేపీ (BJP) భావిస్తోంది. తామ అంచనాలు నిజమైతే 22 సీట్లు ఖాయమని బీజేపీ లెక్కలు వేసుకుటోంది. ఎవరికీ సరైన మెజారిటీ రాకపోతే పార్లమెంట్ ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలనకు బీజేపీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: AP Barrelakka: ఏపీలో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి సై.. వైరల్ వీడియో! ఆలోగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోందన్న చర్చ కాంగ్రెస్, కారు పార్టీ నేతలను కలవరపెడుతోంది. సీట్లు ఎన్నొచ్చినా అధికారం మాదే అంటూ బీజేపీ నేతలు అనేక సార్లు చెప్పిన విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది.నిర్మల్, ముధోల్, బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్ల, కల్వకుర్తి, మక్తల్ తో పాటు.. మహబూబ్‌నగర్, గోషామహల్, అంబర్‌పేట్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, దుబ్బాక, వరంగల్ ఈస్ట్‌లో గెలుపుపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆ స్థానాల్లో బీజేపీ గెలిస్తే తమకు తిరుగు ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ అగ్ర నేతలు. తెలుగు ప్రజలు ఇప్పటి వరకు ప్రతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని.. ఈ సారి కూడా అలానే ఇస్తారన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. #amit-shah #telangana-elections-2023 #g-kishan-reddy #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి