Fire in Mumbai : ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!!
ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనలో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.