Father Killed Daughter: ‘నాన్న పెళ్లి చేసుకోను’.. కూతురి గొంతుకోసి చంపేసిన తండ్రి..!

UPలోని ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. ఒక తండ్రి తన కుమార్తెను గొంతు కోసి చంపాడు. గయూర్ అనే వ్యక్తి తన 19 ఏళ్ల కుమార్తెకు పెళ్లి సంబంధం తెచ్చాడు. కానీ అది ఆమెకు నచ్చలేదు. దీంతో ఆమెకు ప్రేమికుడు ఉన్నాడని భావించి.. పడుకున్న సమయంలో గొంతుకోసి హతమార్చాడు.

New Update
UP muzaffarnagar Father Killed her Daughter

UP muzaffarnagar Father Killed her Daughter

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతురికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అయితే ఆ సంబంధం ఆమెకు నచ్చలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ తండ్రి మంచం మీద పడుకున్న సమయంలో కూతురి గొంతు కోసం చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Father Killed Daughter

ముజఫర్‌నగర్‌ ఖలాపర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కిద్వాయ్ నగర్‌లో ఈ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. గయూర్ అనే వ్యక్తి వారికి నచ్చిన అబ్బాయితో తన 19 ఏళ్ల కుమార్తె అయిన అర్జునికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఒక సంబంధం తీసుకొచ్చాడు. కానీ ఆమెకు ఆ సంబంధం నచ్చలేదు. దీంతో అతడిని పెళ్లి చేసుకోనని ముఖం మీదే చెప్పేసింది. 

అనంతరం తల్లిదండ్రులు ఎంతో నచ్చజెప్పారు. కానీ ఆమె మనసు మారలేదు. దీంతో అప్పటికే చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ యువతి తండ్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తీవ్ర కోపానికి గురై మంచం మీద నిద్రిస్తున్న తన కూతురి గొంతు కోసి హతమార్చాడు. నేరం చేసిన తర్వాత నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన నేరాన్ని అంగీకరించాడు. అనంతరం జరిగిన విషయాన్ని మొత్తం పోలీసులకు తెలిపాడు. 

ఆపై పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని తమ కస్టడీలోకి తీసుకుని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు పంపారు. తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో నిందితుడు గయూర్ సంచలన విషయాలు వెల్లడించాడు. తన కుమార్తె వివాహం దేవ్‌బంద్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేశానని అన్నాడు. కానీ ఆ వివాహానికి తన కుమార్తె అంగీకరించలేదని తెలిపాడు. 

ఆమె వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని అనుమానించానని, అందుకే ఆమె వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదని భావించానన్నాడు. దీంతో విపరీతమైన కోపంతో తన కుమార్తె మంచం మీద నిద్రిస్తున్నప్పుడు గొంతుకోసి చంపేశానని తెలిపాడు. అనంతరం పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు