ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన | Dilawarpur Farmers Protest Against Ethanol Factory | RTV
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసి 60 రోజులు అవుతున్న ఇప్పటివరకు డబ్బులు వేయలేదంటూ నిరసనకు దిగారు.
TG: పత్తి విత్తనాల కొరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డుకు రెండు పత్తి బ్యాగుల చొప్పునే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.
రైతు సంఘాల నేతలు మరోసారి ఢిల్లీలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని.. అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రైతు నేతలు, కేంద్రమంత్రుల మధ్య నాలుగోసారి జరిగిన చర్చలు ముగిశాయి. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తెలిపారు.
రైతులకు మేలు చేసే పథకాలపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చేవి కాదన్నారు. రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది.