USA: డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధికి కమలా హారిస్‌ను కన్ఫామ్ చేశారు. పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఆమె పొందారు .
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధికి కమలా హారిస్‌ను కన్ఫామ్ చేశారు. పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఆమె పొందారు .
అమెరికాలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ సడన్‌గా ముందంజలోకి వచ్చేసింది. ట్రంప్ వెనుకబడిపోయారు అని సర్వేలు చెబుతున్నాయి.
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె అధ్యక్ష అధికారాలను గతంలోనే నిర్వర్తించారు. 2021లో అధ్యక్షుడు జో బైడెన్ అనారోగ్యానికి లోనయ్యారు.ఆ సమయంలో కమలా సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలను నిర్వర్తించారు.
ఈ ఏడాది నవంబ్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. జో బైడెన్, ట్రంప్‌లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే బైడెన్ వృద్ధాప్యం, మతిమరుపు లాంటి సమస్యలతో సొంత పార్టీ ఎంపీల నుంచే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. మరోవైపు నాటో వార్షిక సమావేశాలు వాషింగ్టన్లో మొదలయ్యాయి.
యూకేలో గురువారం సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి బ్రిటన్ ఎన్నికల ఫలితాలు చరిత్ర తిరగరాసేలా ఉన్నాయి.భారతీయ సంతతికి చెందిన ఎంపీల సంఖ్య ఈసారి అత్యధికంగా ఉండొచ్చని తెలుస్తుంది.ఈ సారి యూకే ఎన్నికల్లో భారతీయ సంతతి అభ్యర్థులు 100 మంది వరకు బరిలో నిలిచి పోటీ చేస్తున్నారు.
ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. జులై 1 న ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.31 లక్షల మందికి పెన్షన్లను అందజేయనున్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనబోతున్నారు.
దేశంలో మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధం అుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అందరూ ఐక్యంగా కలిసి పోరాడలని పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు.
జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. కాశ్మీర్ ఎన్నికలను సెప్టెంబర్ 30 వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.