/rtv/media/media_files/2025/07/19/digital-arrest-2025-07-19-10-41-18.jpg)
రోజురోజుకు డిజిటల్ అరెస్ట్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఆన్‌లైన్‌లో బెదిరించి, భయపెట్టి డబ్బులు లాగడం వీళ్ల పని. సీబీఐ, పోలీస్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా నమ్మిస్తూ.. అమాయకులను మోసం చేసి సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు వీరు. ఇలాంటి తప్పుడు ఇంకెవ్వరూ చేయకుండా ఉండేందుకు, డిజిటల్ అరెస్ట్‌లకు అడ్డుకట్ట వేసేందుకు మన ఇండియాలో కఠిన శిక్షలు ఉన్నాయి. 2024 అక్టోబర్‌లో జరిగిన డిజిటల్ అరెస్ట్ నేరంలో పోలీసులు 8 నెలల్లో విచారణ పూర్తి చేసి 9మందిని దోషులుగా కోర్టు ముందు నిలబెట్టింది. వీరికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నిందితులు రూ.కోటి కొట్టేశారు. ఇందులో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ చేశారట. దాదాపు 100 మందికి పైగా బాధితులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
A groundbreaking case where Ranaghat Police in West Bengal achieved India's first conviction for a "digital arrest" scam, sentencing nine individuals to life imprisonment after they extorted over ₹8 crore, including ₹6 crore from West Bengal. https://t.co/WN92Ib1OSF
— Bangla voice (@jacky1095) July 18, 2025
డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోనే తొలిసారిగా దోషిగా తేలిన 9 మంది వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని ఒక కోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. నాడియా జిల్లాలోని కల్యాణి కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇది సైబర్ నేరాలను అరికట్టేందుకు భారతదేశం చేస్తున్న పోరాటంలో ఓ మైలురాయిగా చెప్పొచ్చు. సూచిస్తుంది. 2024 అక్టోబర్‌లో రూ. కోటి మోసపోయానని రిటైర్డ్ శాస్త్రవేత్త పార్థ కుమార్ ముఖర్జీ దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది. తొమ్మిది మంది దోషులను ఎండీ ఇంతియాజ్ అన్సారీ, షాహిద్ అలీ షేక్, షారుక్ రఫిక్ షేక్, జతిన్ అనుప్ లద్వాల్, రోహిత్ సింగ్, రూపేష్ యాదవ్, సాహిల్ సింగ్, పఠాన్ సుమయ్య బాను, పఠాన్ సుమయ్య బాను మరియు ఫల్దు అశోక్‌లుగా గుర్తించారు. శిక్ష పడిన వారిలో నలుగురు మహారాష్ట్ర, ముగ్గురు హర్యానా, ఇద్దరు గుజరాత్‌కు చెందిన వారు.