Diabetes Test with Sweat: సూది అవసరంలేదు.. చెమటతో షుగర్ టెస్ట్.. తెలుగు శాస్త్రవేత్త ఘనత..!
ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త వూసా చిరంజీవి శ్రీనివాసరావు చెమటతో షుగర్ లెవెల్స్ కొలిచే పరికరాన్ని తయారీ చేశారు. దీని ద్వారా సూది అవసరం లేకుండానే షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు. కేంద్రం ఈ పరికరంపై ఆయనకు పేటెంట్ హక్కులు జారీ చేసింది.