Diabetes: షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక ఇన్సులిన్ అక్కర్లేదు మారుతున్న జీవన ప్రమాణాలతో ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన హైడ్రోజెల్ ఔషధం వలన నిత్యం ఇన్సూలిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని,ఏడాదికి 3సార్లు మాత్రమే తీసుకుంటేచాలని పరిశోధకులు అంటున్నారు. By Vijaya Nimma 19 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Diabetes: మారుతున్న జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరిని మధుమేహం కబలిస్తోంది. జీవితకాలం మందులు వాడాల్సిన పరిస్థితి. కొందరికి మధుమేహం అధికంగా ఉండటంతో నిత్యం ఇన్సూలిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. ఇక ఇన్సూలిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని పరిశోధకులు అంటున్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన హైడ్రోజెల్ ఔషధం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. నిత్యం ఇన్సూలిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, సంవత్సరానికి మూడుసార్లు మాత్రమే తీసుకుంటేచాలని అమెరికాకు చెందిన పరిశోధకులు అంటున్నారు. రోజూ మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు.. అలాగే బరువును కూడా అదుపులో ఉంచే ఒజెంపిక్, మౌంజారో, విక్టోజా, ట్రూలిసిటీ మందులకు కూడా ఈ హైడ్రోజెల్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందులను కేవలం 4 నెలలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుందంటున్నారు. హైడ్రోజల్ వ్యవస్థ ఆయా మందులను మెల్లగా మన శరీరంలోకి పంపేలా చేస్తుందని, ఇలా ఈ ప్రక్రియ కొన్ని నెలలు ఉంటుందని అంటున్నారు. అందుకే రోజూ మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. ఈ హైడ్రోజెల్ కొత్తగా తయారు చేసిందేమీ కాదు. ప్రస్తుత కాలంలో అనేక మంది హైడ్రోజెల్‌తో తయారు చేసిన కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటున్నారు. ఇది కూడా చదవండి: చనిపోయిన వారి మాటలు కొందరికి ఎందుకు వినిపిస్తాయి? హైడ్రోజెల్ అంటే నానోపార్టికల్స్‌తో కూడినది. మన బాడీలోకి వెళ్లిన తర్వాత పాలిమర్స్‌తో నానోపార్టికల్స్ అనుసంధానమై ఒక జెల్లా ఏర్పడతాయి. ఇవి విడిపోయేందుకు వారాల సమయం కూడా అవుతుంది. ఇలా తయారైన పాలిమర్, నానోపార్టికల్స్ పొర ద్వారా హైడ్రోజెల్ తయారవుతుంది. శరీరంలోకి పంపిన మందులను ఈ పొర బాగా అడ్డుకుంటుంది. పొర కరిగిపోతున్నప్పుడు మందు కొంచెంకొంచెంగా విడుదల అవుతుంది. అందుకే ఎక్కువ కాలం పాటు మనం తీసుకున్న ఔషధాలు పనిచేస్తూ ఉంటాయి. అయితే హైడ్రోజెల్‌ను మొదట ఎలుకలపై ప్రయోగించి చూశారు. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు పందులపైనా పరీక్షలు చేయబోతున్నారు. ఎందుకంటే పందుల్లో చర్మం, ఎండోక్రైన్ వ్యవస్థలు దాదాపుగా మనుషుల్లో ఉన్నట్టుగానే ఉంటాయి. పందులపై ప్రయోగం విజయవంతమైతే రెండేళ్లలో మనుషులపైనా క్లినికల్ ట్రయల్స్ ఉంటాయని అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #diabetes #insulin సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి