Diabetic Health: మీకు డయాబెటిస్ ఉందా? స్వీట్నెస్ కోసం షుగర్స్‌కు బదులు ఇవి తీసుకోండి! మధుమేహం ఉన్నవారు వాళ్ళ డైట్ లో షుగర్ ప్రాడక్ట్స్ తీసుకోవడానికి భయపడతారు. షుగర్ బదులు ఈ ఐదు రకాల నేచురల్ స్వీట్నర్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ఎక్కువ ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. స్టీవియా, అడ్వాంటేమ్, ఎరిథ్రిటాల్, మాంక్ ఫ్రూట్ షుగర్, ఎరిథ్రిటాల్. By Archana 13 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Diabetic Health: ఈ మధ్య కాలం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య మధుమేహం. ఈ సమస్య ఉన్నవారు వారు తినే ఆహారపు అలవాట్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. హై షుగర్, ఫ్రైడ్ ఫుడ్స్, హై సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మధుమేహం ఉన్నవారు స్వీట్స్, లేదా ఏదైనా షుగర్ ఐటమ్స్ తీసుకోవడానికి చాలా భయపడతారు. ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కర స్థాయిలను మరింత పెంచే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ సమస్య ఉన్నవారు షుగర్ ఐటమ్స్ తినేటప్పుడు వాటిలో షుగర్ బదులు ఈ నేచురల్ స్వీట్నర్స్ వాడితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పై మంచి ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మాంక్ ఫ్రూట్ షుగర్ మాంక్ ఫ్రూట్ షుగర్ FDA( ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ నుంచి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మధుమేహం ఉన్నవారు వారి డైట్ లో దీనిని తీసుకుంటే రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. డయాబెటీస్ రోగులకు ఇది సరైన ఎంపిక. అడ్వాంటేమ్ అడ్వాంటేమ్.. ఇది మధుమేహ రోగులకు సరైన ఎంపిక. ఇది సాధారణ చక్కర కంటే 20,000 టైమ్స్ ఎక్కువ స్వీట్ గా ఉంటుందని FDA సంస్థ తెలిపింది. అందుకే దీన్ని కొంచం వాడిన సరిపోతుంది. Also Read: Bay leaves Tips: ఈ ఆకుతో.. డాన్డ్రప్ సమస్య దెబ్బకు మాయం స్టీవియా ఇది నేచురల్ స్వీట్నర్. స్టీవియా లో తక్కువ కేలరీలతో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బయోటిక్ గుణాలను కలిగి ఉంటుంది. డైయాబెటీస్ రోగుల పై ఇది మంచి ప్రభావం చూపుతుంది. స్టీవియా ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి.. గ్లూకోస్ టాలరెన్స్ పెంచుతుంది. ఎరిథ్రిటాల్ ఇది సహజంగా లభించే షుగర్. దీన్ని ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీస్ లో క్యాండీస్, బేకరీ ఐటమ్స్ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చక్కెరలో తక్కువ కేలరీస్ ఉంటాయి. మధుమేహం ఉన్నవారు ఆర్టిఫీషియల్ షుగర్స్ బదులు వీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. జిలిటోల్ షుగర్ మధుమేహం సమస్య ఉన్నవారు వారి డైట్ లో జిలిటోల్ షుగర్ తీసుకుంటే మంచి ప్రభావం ఉంటుంది. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ వాల్యూ.. రక్తంలోని గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను పెరగడాన్ని తగ్గిస్తుంది. అంతే ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: celery juice: ఈ జ్యూస్ తాగితే.. మీ ఆరోగ్యానికి ఏ బాధ ఉండదు.. ట్రై చేయండి #diabetes #sugar-alternatives-for-diabetics సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి