షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫుడ్స్..
మధుమేహ బాధితులు షుగర్ లెవల్స్ సరిగా మేనేజ్ చేసే ఆహారం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, తీవ్రమైన అనారోగ్యాల ముప్పును తగ్గించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ వీరికి మంచివని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహ బాధితులు షుగర్ లెవల్స్ సరిగా మేనేజ్ చేసే ఆహారం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, తీవ్రమైన అనారోగ్యాల ముప్పును తగ్గించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ వీరికి మంచివని వైద్యులు చెబుతున్నారు.
నేటి కాలంలో షుగర్ సమస్య పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ, తక్కువ కావొచ్చు. షుగర్ ఉన్నవారికి రాత్రుళ్ళు షుగర్ లెవల్స్ తక్కువైతే హైపోగ్లైసీమియా అంటారు. అయితే రాత్రిపూట రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు ఏమేం లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి.
మెడలో నల్లగా మారడం లేదా నొప్పి రావడం కాలేయ వ్యాధి, స్ట్రోక్ వచ్చే అవకాశాలకు సంకేతం. మధుమేహం ఉన్నవారికి మెడ నల్లగా మారితే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఊబకాయం ఉన్నవారి శరీరంలోని కొన్ని భాగాలలో నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి.
తిప్పతీగ అనేది ఆయుర్వేద ఔషధం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తవానికి, ఆయుర్వేదంలో, తిప్పతీగను 'మధునాశిని' అని పిలుస్తారు, అంటే 'చక్కెరను నాశనం చేసేది'. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
మధుమేహంతో బాధపడేవారికి జీడి పప్పు సరైన ఎంపిక. వీటిలోని మంచి కొవ్వులను శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా, డ్రైడ్ ఫీగ్స్, డ్రైడ్ అప్రీకట్స్, వాల్ నట్స్ కూడా చాలా డయాబెటిస్ పేషెంట్లకు మంచివి. వీటి ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.
ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ రసాయనం గ్లూకోజ్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే అధిక ఒత్తిడి షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడంతో షుగర్‌తో ఒత్తిడిని కంట్రోల్ చేయవచ్చు.
గురక.. ఓ శబ్ద పిశాచమని చాలామంది అభిప్రాయపడుతుంటారు. గురక ధమనుల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఎక్కువగా గురక పెట్టే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు గురకపెట్టే అలవాటు టైప్-2 డయాబెటిస్‌కు సంకేతం.
మీ కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే మధుమేహం ఉంటే, మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు క్రమం తప్పకుండా పాలు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
డయాబెటిక్ రోగులు డ్రై ఫ్రూట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, వాల్నట్, పిస్తాపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండుద్రాక్ష, అంజీర్ పండ్ల, ఖర్జూరం వంటికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.