CM Revanth Reddy: రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. ప్రధానితో మీటింగ్ తో పాటు సీఎం షెడ్యూల్ ఇదే!
సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైకమాండ్ పెద్దలతో సమావేశమై నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం.