Heat: వామ్మో ఏం ఎండలు..రోళ్లు పగలడం కాదు..ఏకంగా వాషింగ్ మెషినే పేలిపోయింది! ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రాంతంలో ఏకంగా ఎండ వేడికి వాషింగ్ మిషనే పేలి మంటలు చెలరేగాయి.ఘజియాబాద్‌కి చెందిన ఓ ఫ్లాట్ బాల్కనీలో పెట్టిన వాషింగ్ మిషన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అది చూసి జనం కంగారుపడ్డారు. ప్రజలు గుమిగూడి మంటలను ఎలాగోలా అదుపు చేశారు. By Bhavana 30 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Noida: దేశ వ్యాప్తంగా ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. దేశంలోని కొన్ని చోట్ల 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటింది. ఎండలు తీవ్రతకు రోడ్లు కరిగిపోవడం, రోళ్లు పగలడం వంటి సంఘటనలను చూస్తూనే ఉంటాం. కానీ గురువారం ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రాంతంలో ఏకంగా ఎండ వేడికి వాషింగ్ మిషనే పేలి మంటలు చెలరేగాయి. ఘజియాబాద్‌కి చెందిన ఓ ఫ్లాట్ బాల్కనీలో పెట్టిన వాషింగ్ మిషన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అది చూసి జనం కంగారుపడ్డారు. ప్రజలు గుమిగూడి మంటలను ఎలాగోలా అదుపు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిటీ 2 సొసైటీ కి చెందిన ఓ ఫ్లాట్ బాల్కనీలో వాషింగ్ మిషన్ ఉంచారు. విపరీతమైన వేడికి వాషింగ్ మిషన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కొద్దిసేపటికే అది పూర్తిగా కాలిపోయి పొగలు వచ్చాయి. బాల్కనీలో పొగలు రావడంతో ప్రజలు వెంటనే భవనం దగ్గరకు చేరారు. వెంటనే చుట్టుపక్కల ఫ్లాట్లలో నివాసముంటున్న వారికి సమాచారం అందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రజలు యంత్రంలో మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికి యంత్రం పూర్తిగా ధ్వంసమైంది. అయితే మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వాషింగ్ మెషీన్లో మంటలు చెలరేగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also read: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడ ఉన్నాయి…ఆల్ ఐస్ ఆన్ రఫా పై ఇజ్రాయిల్ సీరియస్! #gaziabad #heat #washing-machine #delhi #summer #noida మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి