Mahabubnagar: మహబూబ్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. పిల్లలతో సహా ఎంతమంది చనిపోయారంటే
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న డీసీఎం రోడ్డుపై ఆగివున్న ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా బాలానగర్ పరిధిలోని తండా వాసులుగా గుర్తించారు. మృతుల బంధువులు డీసీఎంకు నిప్పంటించారు.